ఎయిమ్స్ నుంచి భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‎ఖడ్ డిశ్చార్జ్

ఎయిమ్స్ నుంచి భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‎ఖడ్ డిశ్చార్జ్

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిమ్స్ నుంచి భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‎ఖడ్ డిశ్చార్ అయ్యారు. గుండె సంబంధిత సమస్యలతో మార్చి 9న ఎయిమ్స్‎లో జాయిన్ అయిన ధన్ ఖడ్.. పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఈ మేరకు బుధవారం (మార్చి 12) ఢిల్లీ ఎయిమ్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్‎ఖడ్ చికిత్సకు బాగా స్పందించారు. ఎయిమ్స్‌లోని వైద్య బృందం నుంచి అవసరమైన ట్రీట్మెంట్ పొంది ఆయన సంతృప్తికరంగా కోలుకున్నారు’’ అని పేర్కొన్నారు. ధన్ ఖడ్ కోలువకోవడంతో ఆయనను మార్చి 12న డిశ్చార్జ్ చేశామని తెలిపారు. అలాగే.. కొన్ని రోజులు తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. 

కాగా, ఆదివారం (మార్చి 9) తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఉపరాష్ట్రపతి ధన్‎‎ఖడ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు, సిబ్బంది హుటాహుటిన ఆయనను ఎయిమ్స్‌కు తరలించారు. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ధంకడ్‎కు క్రిటికల్ కేర్ యూనిట్ (సిసియు)లో చికిత్స అందించారు. ప్రధాని మోడీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎయిమ్స్‎కు వెళ్లి జగదీప్ ధన్ ఖడ్‎ను పరామర్శించారు. 

ALSO READ | హోలీ పండుగ ఏడాదికి ఒక్కసారి.. ముస్లింల జుమ్మాలు 52...పోలీసు అధికారి వ్యాఖ్యలు వివాదాస్పదం..