
తూప్రాన్, వెలుగు: మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలంగాణ రాష్ర్ట ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి అన్నారు. శుక్రవారం ఆయన తూప్రాన్ మండలం వెంకటాయపల్లిలో మండలానికి చెందిన ముదిరాజ్ సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ముదిరాజులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులను మోసం చేసి గద్దెనెక్కిందని ఆరోపించారు. కార్యక్రమంలో జిన్న రాజు, పాండు, రమేశ్, గుమ్మడి శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.