
ఆంధ్ర ప్రదేశ్: గవర్నమెంట్ స్కూళ్లలో తెలుగులో ప్రాథమిక బోధన ఉండాలని అన్నారు ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు. విజయవాడ ఆత్కూరు స్వర్ణ భారతి ట్రస్ట్ లో మీడియా తో మాట్లాడిన ఆయన… మాతృభాషా ప్రాధాన్యం విషయంలో తనది మొదటి నుంచి ఒకటే అభిప్రాయం అని చెప్పారు. ప్రతీ ప్రభుత్వ బడిలో తెలుగులో తప్పనిసరి పాఠాలు చెప్పాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం మాతృ భాషా ప్రాధాన్యంపై అనేక సార్లు ప్రస్తావించారని చెప్పారు.
అభివృద్ధి వికేంద్రీకరణకు తాను మొదటి నుంచి కట్టుబడి ఉన్నానని అన్నారు వెంకయ్యనాయుడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత కేంద్ర సంస్థలను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని తెలిపారు. పాలన ఒక్క చోట నుంచే ఉండాలనేది తన అభిప్రాయమని చెప్పారు. సీఎం, పాలనా యంత్రంగం, హైకోర్టు, అసెంబ్లీ ఒక్క చోటనే ఉండాలని తెలిపారు. అన్ని ఒక్క చోట ఉంటేనే పాలన బాగుంటుందని చెప్పారు. అది ఎక్కడ అనేది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమని అన్నారు…తన 42 ఏళ్ళ అనుభవం తో ఈ మాట చెపుతున్నానని….వివాదం కోసమో, రాజకీయ కోణమో ఇందులో లేదని తెలిపారు.