Chhaava Trailer Review: ఛావా ట్రైలర్ X రివ్యూ.. విక్కీ,రష్మిక నటన గూస్‌బంప్స్.. నెటిజన్ కామెంట్స్

Chhaava Trailer Review: ఛావా ట్రైలర్ X రివ్యూ.. విక్కీ,రష్మిక  నటన గూస్‌బంప్స్.. నెటిజన్ కామెంట్స్

రష్మిక మందన్న నుంచి రాబోయే లేటెస్ట్ బాలీవుడ్ హిస్టారికల్ మూవీ ఛావా. ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవితం ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించాడు.

ఇందులో శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక కనిపించనున్నారు.మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్‌గా అక్షయ్ ఖన్నా నటించారు. హంబిరావు మోహితేగా అశుతోష్ రాణా, సోయారాబాయిగా దివ్య దత్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

తాజాగా విడుదల చేసిన ఛావా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ ఎపిక్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ట్రైలర్‌ విజువల్స్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చావా ట్రైలర్ గూస్‌బంప్స్ అని.. విక్కీ, రష్మిక లుక్స్ ఇన్‌క్రెడిబుల్ అని పోస్టులు పెడుతున్నారు.

చావా ట్రైలర్ గూస్‌బంప్స్. విక్కీ, రష్మిక తమ నటనతో సినిమాపై అంచనాలు పెంచారు. ఒక్కమాటలో చెప్పాలంటే..'వాట్ ఏ ట్రైలర్ మాన్.. గూస్‌బంప్స్, గూస్‌బంప్స్, గూస్‌బంప్స్'. చివరగా విక్కీ కౌశల్ శంభాజీ పాత్రను ఎంతో పర్ఫెక్ట్‌గా చేశారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

"సింహం లేకుండా ఉండొచ్చుకానీ.. ఆ సింహానికి పుట్టిన ఛావా ఇంకా బతికే ఉంది.. మరాఠాలను సవాలు చేయడానికి ధైర్యం చేస్తే మొఘల్ సామ్రాజ్యాన్నే లేకుండా చేస్తాం.. అంటూ సాగే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

ఛావా ఒక కళాఖండానికి తక్కువేం కాదు! ఛత్రపతి శంభాజీ మహారాజ్ యొక్క శక్తివంతమైన పాత్రలో విక్కీ అదరగొట్టారు. విజువల్స్  అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్ ఒక పురాణ సినిమా అనుభూతిని ఇస్తుందని మరో నెటిజన్ పోస్ట్ పెట్టాడు.

ఇటీవలే జిమ్లో వర్కవుట్ చేస్తూ గాయపడ్డ రష్మిక కుంటుతూనే చావా ట్రైలర్ లాంచ్ కి వచ్చారు. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ... 'ఈ సినిమాలో శంభాజీ భార్య ఏసుబాయిగా నటించే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా, ఒక నటిగా నాకు ఇంతకు మించి ఏం కావాలి, ట్రైలర్ చూశాక కూడా ఎమోషనల్ అయ్యా, విక్కీ కౌశల్ ఇందులో నాకు దేవుడిలా కనిపిస్తున్నాడు.

ALSO READ | Janhvi Kapoor: పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లలతో తిరుపతిలో సెటిలవుతా

ఈ సినిమా కోసం డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ నన్ను సంప్రదించినపడు ఆశ్చర్యపోయా, ఏమీ ఆలోచించకుండా వెంటనే అంగీకరించా. ఈ పాత్రకోసం ఎన్నో రిహార్సల్స్ చేశా. టీమ్ అంతా ఎంతో సహకరించింది. ఇందులోని పాత్రలు అందరినీ ప్రభావితం చేస్తాయి' అని రష్మిక చెప్పుకొచ్చింది. లెజెండరీ AR రెహమాన్ సంగీతం అందించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న థియేటర్లలలో రిలీజ్ కానుంది.