పుష్ప 2 రికార్డ్స్ జస్ట్ మిస్.. రెండో వారం కూడా తగ్గని ఛావా కలెక్షన్స్..

పుష్ప 2 రికార్డ్స్ జస్ట్ మిస్.. రెండో వారం కూడా తగ్గని ఛావా కలెక్షన్స్..

నేషనల్ అవార్డు విన్నర్ బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ హీరోగా నటించిన "ఛావా"  సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాని మరాఠా యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కించారు. హిస్టరీ ని చెబుతూ, మంచి ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈ సినిమాకి రిలీజ్ రోజునుంచే మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమా రిలీజై 2 వారాలు కావస్తున్నా ఇప్పటికీ ఫుల్ ఆక్యుపెన్సీతో కలక్షన్స్ సాధిస్తోంది. దీంతో పలు రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ చిత్రం కలెక్షన్లు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి.

అయితే రెండో శనివారం విక్కీ కౌశల్ ఛావా దేశవ్యాప్తంగా రూ.44.10 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ సినిమా రిలీజ్ రోజు కేవలం రూ.31 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. కానీ ఫస్ట్ డే మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవడంతో రోజుకి రూ.35 నుంచి  రూ.40 కోట్లు తగ్గకుండా కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతోంది.

Also Read : కిస్ సీన్స్ కూడా చేస్తా.. కానీ అది డిమాండ్ చేస్తేనే అంటున్న రీతూ వర్మ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప 2: ది రూల్ రెండవ శనివారం రూ. 46.50 కోట్లు కలెక్ట్ చేసింది. శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ 2 రెండవ శనివారం రూ. 33.80 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో బాలీవుడ్ లో 2వ శనివారం అత్యధిక వసూలు సాధించిన సినిమాల లిస్ట్ లో ఛావా రెండో స్థానంలో నిలిచింది. కానీ టాప్ లో మాత్రం పుష్ప 2 కొనసాగుతోంది.  బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ (రూ. 30.10 కోట్లు) మరియు బాహుబలి 2 (రూ. 26.50 కోట్లు) వరుసగా నాల్గవ మరియు ఐదవ స్థానాల్లో కొనసాగుతున్నాయి.

ఛావా సినిమాలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నా మరియు రష్మిక మందన్న కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మించారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు.