తెలుగులో ఛావా హవా.. రెండురోజుల్లోనే అన్ని రూ.కోట్లు కలెక్ట్ చేసిందా..?

తెలుగులో ఛావా హవా.. రెండురోజుల్లోనే అన్ని రూ.కోట్లు కలెక్ట్ చేసిందా..?

విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ బయోపిక్ గా వచ్చిన సినిమా చావా. ఈ సినిమా బాలీవుడ్ లో బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిం చింది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామి సృష్టించింది. హిందీలోనే 600 కోట్లకు పైగా కలెక్షన్లు తెచ్చిపెట్టిం ది. తాజాగా తెలుగు ప్రేక్షకుల డిమాండ్ మేరకే ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 500కు పైగా థియేటర్లలో గీత ఆర్ట్స్ గ్రాండ్ గా విడుదల చేసింది. 

అయితే హిందీతో పాటు తెలుగులో మంచి కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతోంది. మార్చ్ 7న 2.9 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ సినిమా రెండో రోజుకూడా ఇదే హవాని కొనసాగిస్తూ రూ.2.5 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో టాలీవుడ్ లో రెండు రోజుల్లో రూ.5.8 కోట్లు పైగా కలెక్ట్ చేసింది. వీకెండ్ ఉండటం, మౌత్ పబ్లిసిటీ బాగుండటంతో కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. అయితే ఈ సినిమాని గీతా ఆర్ట్స్ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేందుకుగానూ దాదాపుగా రూ.40 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం.. కానీ రెండురోజుల్లోనే లాభాల్లోకి వచ్చేసింది. దీంతో దర్శకనిర్మాతలు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

సాధారణంగా హిందీ డబ్బింగ్ సినిమాలకు ఇక్కడ భారీ ఓపెనింగ్స్ రావడం అరుదు. కానీ 'ఛావా'కి ముందు నుంచే పాజిటివ్ బజ్ ఉండడంతో తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. వి భిన్నమైన కథ, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఏఆర్ రెహ్మాన్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్గా నిలిచాయి.