1971 ఇండో– పాక్ వార్‌లో భారత్ విజయం సాధించడంలో సామ్మానెక్షా కీలక వ్యక్తి. ఇప్పుడు ఆయన జీవితం ఆధారంగా బాలీవుడ్లో సామ్ బహదూర్(Sam Bahadur) సినిమా తెరకెక్కుతోంది. విక్కీ కౌశల్ (సామ్ మానెక్షా) లీడ్ రోల్ చేయగా.. ఇందిరా గాంధీ పాత్రలో సనా ఫాతిమా షేక్ (Sana Fatima Sheikh) నటించింది. ఇందుకు సంబంధించిన టీజర్‌ను మూవీ టీం తాజాగా విడుదల చేసింది. విక్కీ కౌశల్ సైన్యానికి ట్రైనింగ్ ఇచ్చే విధానం..తన ఇంటెన్స్ యాక్టింగ్ తో టీజర్ అదిరిపోయింది.
ALSO READ : తెలంగాణలో డీఎస్సీ వాయిదా
ఈ సందర్భంగా సనా మాట్లాడుతూ..ఇందిరగా నటించాలని డైరెక్టర్ గుల్జార్ తనకు చెప్పినప్పుడు చాలా భయపడినట్టు తెలిపింది. ఇది చాలా పెద్ద పాత్ర. చారిత్రక నేపథ్యం కలిగింది. ఇందులో నటించడానికి మొదట చాలా భయపడ్డాను. ఆ టైంలో దర్శకురాలు నాకు ధైర్యం చెప్పి..నటించేలా ప్రోత్సాహం అందించింది. నన్ను నమ్ము..నేను చూసుకుంటానని ఆమె చెప్పిన ఒక్క మాటతో నేను ముందడుగేశాను.. అని సనా తెలిపింది. అమీర్ ఖాన్ దంగల్‌లో గీతా ఫోగట్‌గా సనా నటించింది. డిసెంబర్ 1న ఈ మూవీ రిలీజ్ కానుంది.
సామ్ బహదూర్ భారతదేశపు ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్షా జీవితం..నాలుగు దశాబ్దాలుగా భారత సైన్యంలో అనేక యుద్ధాలలో పాల్గొన్నారు. అతను ఫీల్డ్ మార్షల్ స్థాయి వరకి ఎదిగి..పదోన్నతి పొందిన మొదటి ఇండియన్ ఆర్మీ అధికారి. 1971 ఇండో-పాక్ యుద్ధంలో అతను సాధించిన సైనిక విజయం బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసింది.