నిజమైన యోధుల కథ ఛావా

నిజమైన యోధుల కథ ఛావా

విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన హిందీ చిత్రం ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో  దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌గా  ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా  విక్కీ కౌశల్ మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో ప్రిపేర్ అయ్యాను. ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్ర చేయడం సవాలుగా అనిపించింది. 

ఛత్రపతి శివాజీ మహారాజ్ శ్రీరాముని వంటి వారు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ సింహం వంటి యోధులు. ఈ పాత్రలను ఇంతకంటే గొప్పగా నేను చెప్పలేను. నిజమైన యోధుల కథను చెబుతున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించిన దినేష్ విజన్ గారికి, తెరకెక్కించిన లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. రెహమాన్ గారి సంగీతం సినిమా స్థాయిని మరో లెవల్‌‌‌‌‌‌‌‌కి తీసుకెళ్లింది’ అని చెప్పాడు.  రష్మిక  మాట్లాడుతూ ‘ఈ చిత్రం నాకొక మెమరబుల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్.

ఇందులో ఓ దైవత్వం ఉంటుంది. అంతులేని ప్రేమ ఉంటుంది. నేను మహారాణి యేసు భాయి పాత్రలో కనిపిస్తా. చాలా ఎమోషనల్‌‌‌‌‌‌‌‌గా సినిమా ఉంటుంది. ఈ మూవీని చూసిన ప్రతిసారి నేను ఏడ్చేసాను. అంత అద్భుతంగా ఉంటుంది. ఏ ఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, జానే తూ అనే పాట అందర్ని మెస్మరైజ్ చేస్తుంది. ఛావా పాత్రకు విక్కీ అద్భుతంగా సెట్ అయ్యారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’ అని చెప్పింది.