చండ్రుగొండ, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని బాల్యతండా గ్రామ శివారులోని ఎకరం పోడు భూమిలో శనివారం తెల్లవారుజామున ఫారెస్ట్ ఆఫీసర్లు పత్తి మొక్కలు పీకేసినట్లు బాధితుడు ఆరోపించాడు. పోడు పట్టా భూమిలో పత్తి సాగు చేస్తున్నాని రైతు భూక్యా మిట్టు అంటుండగా, కొత్తగా పోడు నరికి సాగు చేస్తున్నాడని మొక్కలు పీకేసినట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు అంటున్నారు.
బాధితుడు మాట్లాడుతూ తనకు పోడు పట్టా కలిగిన ముడున్నర ఎకరాల్లో ఈ ఏడాది పత్తి సాగు చేస్తున్నట్లు తెలిపారు. కానీ శనివారం తెల్లవారుజామున ఫారెస్ట్ ఆఫీసర్లు సిబ్బంది తో వచ్చి ఎకరం భూమిలోని పత్తి మొక్కలు పీకి వెంట తీసుకెళ్లారని ఆరోపించారు. కొన్ని పీకేసిన మొక్కలను సేకరించి కుటుంబ సభ్యులతో కలిసి నిరసన తెలుపుతున్నామని, తమకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయమై రేంజర్ ఎల్లయ్యను వివరణ కోరగా ఆ భూమి ఫారెస్ట్ దా? పోడు భూమా? అనేది ఎంక్వైరీ చేస్తామని తెలిపారు.