
- సీఐ కరుణాకర్ కు బాధిత కుటుంబం వినతి
అశ్వారావుపేట, వెలుగు: అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలో ఇటీవల కోడిపుంజు దొంగతనం కేసులో నాగరాజుకు కరెంట్ షాక్ ఇచ్చి చిత్రహింసలు పెట్టిన పెట్టినట్లు ఆరోపిస్తున్న బాధిత కుటుంబం, దళిత సంఘాలతో కలిసి శనివారం ఏఎస్సైపై అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో సీఐ కరుణాకర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు మాట్లాడారు. కోడిపుంజును దొంగిలించారంటూ అప్పారావు అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తనను పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఏఎస్సై రామ్మూర్తి చిత్రహింసలు పెట్టారని నాగరాజు ఆరోపించాడు.
తనను దొంగతనం ఒప్పుకోవాలని విద్యుత్ షాక్ కూడా పెట్టారన్నారు. తనపై ఉపయోగించిన థర్డ్ డిగ్రీకి వారం రోజులు పాటు ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకొని వచ్చానని, అయినా సంవత్సరం పాటు లేవలేని పరిస్థితి ఉందంటూ కన్నీటిపర్వతమయ్యాడు. దళిత సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి తగరం రాంబాబు మాట్లాడుతూ దొంగతనం నెపంతో దళితుడిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించడం దారుణమని, దీన్ని స్పెషల్ కేసుగా తీసుకొని ఏఎస్సై పై చర్యలు తీసుకోవాలని
ఎస్పీ, డీజీపీని కోరారు.