కొడిమ్యాల,వెలుగు: తనకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును వేరే వ్యక్తులు తమ ఖాతాలో వేసుకున్నారని, దయచేసి చెక్కు వచ్చేలా చర్యలు తీసుకోవాలని బాధితుడు ఎమ్మెల్యే రవిశంకర్‌ను వేడుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన మంచాల శ్రీనివాస్ 2019లో అనారోగ్యంతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చవడంతో సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రూ.60వేల చెక్కు మంజూరైంది.
అయితే ఆ చెక్కును తన పేరు కలిగిన వ్యక్తులు ఎవరో అక్రమంగా వారి అకౌంట్ లో వేసుకుని డ్రా చేసుకున్నారని ఆరోపించాడు. మూడేండ్లుగా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయాడు. దయచేసి తన చెక్కు ఇప్పించాలని వేడుకున్నాడు.