మాజీ మంత్రి మల్లారెడ్డి పాలు.. పూలు అమ్ముడే కాదు భూకబ్జాలు కూడా చేశారని బాధితుడు మహమ్మద్ బషీర్ ఆరోపించారు. పేట్ బషీరాబాద్ లోని 82 సర్వే నంబర్ లో ఎకరం 29 గుంటల కన్నా.. ఎక్కువ ఉంటే మీకు సారీ చెప్పి రాజకీయాల నుంచి వెళ్లిపోతా అని మల్లారెడ్డి చెప్పాడు. రెవెన్యూశాఖ మే 19న చేసిన సర్వేలో 82 సర్వే నంబర్ లో మల్లారెడ్డికి చెందిన ఎకరం 29 గుంటలతో పాటు 33 గుంట భూమిని కబ్జా చేసిండు. మాల్లారెడ్డి తన ఎకరం 29 గుంటలు తీసుకుని మా 33 గుంటలను మాకు పొజిషన్ ఇప్పించాలి. మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి ముందే సర్వే జరిగింది. భూకబ్జా జరిగినట్లు ప్రూఫ్ ఉంది. మల్లారెడ్డి మాట మీద నిలబడాలి.
2016 లో మల్లారెడ్డి బీఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత మా పార్టీషన్ తీసేసి మాపైన కేసు పెట్టించాడు. అప్పుడు పోలీసులను ఆశ్రయిస్తే కోర్టుకు వెళ్లమన్నాడు. కోర్టు నుంచి నాట్ టు ఇంటర్ ఫియర్ ఆర్డర్ తీసుకొచ్చాం. కోర్ట్ ఆర్డర్ ఉన్నా... అప్పట్లో మాకు న్యాయం జరగలేదు. రీసెంట్ గా మా డాక్యుమెంట్స్, కోర్టు ఆర్డర్ తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్ళాం. మాకు సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి మా ల్యాండ్ లోకి మమ్మల్ని వెళ్ళమని పోలీసులు చెప్పారు. దీంతో మా ల్యాండ్ కి వెళ్లి మేము బ్లూ షీట్స్ వేసుకున్నాం. దీంతో మల్లారెడ్డి వచ్చి మాపై దాడులు చేసి పోలీసుల ముందే మేము వేసిన బ్లూ షీట్స్ తొలగించారు. పోలీసుల ముందే మమ్మల్ని చంపేస్తామని బెదిరించారని బాధితులు ఆరోపించారు.