- మా డబ్బులు మాకు చెల్లించండి
- సూర్యాపేట ఎస్బీఐ ఆర్ఎంకు బాధితుల వినతిపత్రం
సూర్యాపేట, వెలుగు: తీసుకోని లోన్లకు ఈఎంఐలు కడుతున్నామని, తమ డబ్బులు ఇప్పించాలని బాధితులు మొరపెట్టుకుంటున్నారు. సోమవారం ఎస్పీఐ రీజినల్ మేనేజర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ కొంతకాలం కింద ఉద్యోగ లోన్ల కోసం ఎస్బీఐ సూర్యాపేట బ్రాంచ్‌లో దరఖాస్తు చేసుకున్నామని, అప్పటి మేనేజర్ సైదులు తమ సంతకాలు ఫోర్జరీ చేసి లోన్లు తీసుకున్నాడని ఆరోపించారు. దీంతో తమకు తెలియకుండానే తమ జీతాల నుంచి ప్రతి నెలా ఈఎంఐ కట్ అవుతోందన్నారు.
హైదరాబాద్‌లోని రెండు బ్రాంచుల్లో ఇలాగే మోసపోయినవారికి ఎస్బీఐ ఉన్నతాధికారులు డబ్బులు చెల్లించారని, తమకు కూడా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మేనేజర్ అక్రమాలపై పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. గతంలో మేనేజర్ గా పని చేసిన సైదులు పలు బ్రాంచ్‌లకు చెందిన ఖాతాదారుల పేర సుమారు రూ.30 కోట్ల మేర రుణాలు కాజేసినట్టు తెలుస్తోంది. ఇటీవల ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.