పైసలు కట్టనందుకు కులం నుంచి వెలేస్తామంటున్నరు!

పైసలు కట్టనందుకు కులం నుంచి వెలేస్తామంటున్నరు!
  • ప్రజావాణిలో కలెక్టర్ కు బాధిత కుటుంబాల ఫిర్యాదు

యాదాద్రి, వెలుగు : పైసలు కట్టనందుకు కులం నుంచి వెలేస్తామని కుల పెద్దలు బెదిరిస్తున్నారని బాధిత కుటుంబాలు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చందుపట్లలో బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేసే వాళ్లు రజక కుల సంఘానికి రూ.50 వేలు చెల్లించాలని కుల పెద్దలు తీర్మానం చేశారు. అదే కులానికి చెందిన సిరికొండ వెంకటేశ్, శివకుమార్, వెంకటేశ్, శ్రీనివాస్‌‌ కుటుంబాలు డబ్బులు చెల్లించలేదు. దీంతో వీరితో రజకులు ఎవరూ మాట్లాడకూడదని కుల పెద్దలు ఆదేశాలు జారీ చేశారు. 

ఆపై ఇంటికి వచ్చి గొడవకు దిగి దాడి చేసేందుకు యత్నించారు. దీంతో నాలుగు బాధిత కుటుంబాలు భువనగిరి రూరల్ ​పోలీసులకు ఫిర్యాదు చేశాయి. వారం రోజులు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ హనుమంతరావుకు బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేశాయి. కుల పెద్దలతో ప్రాణభయం ఉందని, తమకు న్యాయం చేయాలని కోరాయి.