సూర్యాపేట కలెక్టరేట్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలిస్తానని ఏజెన్సీ నిర్వాహకుడు మోసం చేశాడని ఆరోపిస్తూ బాధితులు ఏజెన్సీ ఎదుట మంగళవారం ఆందోళన చేశారు. తర్వాత సూర్యాపేట టౌన్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్లో స్వీపర్, అటెండర్ ఉద్యోగాలిప్పిస్తామని ఒక్కొక్కరి దగ్గర రూ.2 లక్షల చొప్పున 40 మంది నుంచి మణికంఠ ఔట్‌సోర్సింగ్ సర్వీసెస్ ఏజెన్సీ నిర్వాహకుడు గజ్జి శంకర్ డబ్బులు తీసుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు.
శానిటేషన్విభాగంలో ముగ్గురిని తీసుకోవడానికే అనుమతి ఉందని, వారిని తీసుకోవడంతో పాటు మరో 40 మంది దగ్గర డబ్బులు తీసుకున్నట్టు తెలిసింది. సదరు నిర్వాహకుడు బీఆర్ఎస్కు చెందిన వ్యక్తి అన్న ఆరోపణలున్నాయి.