ఇతడు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజీవాడికి చెందిన రైతు కుమ్మరి రాజయ్య. ఇతని ఫ్యామిలీకి సర్వే నంబర్13/1లో 3 ఎకరాల 2 గుంటల భూమి ఉంది. పట్టాదారు పాస్‌బుక్, ధరణిలో అన్ని వివరాలు ఉన్నాయి. పక్క పొలం వారు భూమి కబ్జాలో ఉన్నారు. కొలతలు వేసి, తనకు హద్దులు చూపాలని 2018లో సర్వే ల్యాండ్రికార్డ్స్ఆఫీసర్లకు అప్లికేషన్పెట్టుకున్నాడు. చలానా కూడా చెల్లించాడు. పలుమార్లు మండల, జిల్లా స్థాయి ఆఫీసర్లను కలిసి విన్నవించాడు. అయినా కొలతలు చేయలేదు. ఆఫీసుల చుట్టూ తిరిగి విసుగెత్తిన రాజయ్య అధికారుల ముందే ఆత్మహత్య చేసుకుంటానని గతనెల 29న ప్రజావాణి కిరోసిన్బాటిల్ తో వచ్చాడు. మెయిన్‌గేట్ వద్ద పోలీసులు తనిఖీ చేసి బాటిల్‌స్వాధీనం చేసుకున్నారు. ఎన్నిసార్లు తిరిగినా కొలతలు చేయడం లేదని సదరు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
కామారెడ్డి, వెలుగు: వ్యవసాయ భూములకు సంబంధించి లిటిగేషన్లో ఉన్న వాటికి కొలతలు వేయమని, హద్దులు చూపమని రైతులు పెట్టుకున్న అర్జీలకు మోక్షం లభించడం లేదన్నారు. దీంతో రైతులకు నిత్యం తగాదాలు తప్పడం లేదు. కామారెడ్డి జిల్లాలో వందలాది మంది రైతుల నుంచి వచ్చిన అప్లికేషన్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. దరఖాస్తు పెట్టిన నెల రోజుల్లో సంబంధిత రైతుతో పాటు, కొలతలు వేసే భూమి చుట్టూ ఉన్న రైతులకు కూడా నోటీసులు జారీ చేయాలి. నోటీసులో పేర్కొన్న తేదీ ప్రకారం మండల సర్వేయర్, లేదా డివిజన్ ఇన్స్పెక్టర్ వెళ్లి కొలతలు వేసి సరిగ్గా ఉన్నాయా? లేదా? అని పరిశీలించి హద్దులు చూపాలి. కానీ నెలల తరబడి ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా సర్వే ల్యాండ్రికార్డ్స్ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెండింగ్‌లో 900కు పైగా అప్లికేషన్లు
జిల్లాలో ఏడాది కాలంలో భూమి కొలతలు, హద్దుల కోసం 1023 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో 112 పరిష్కరించారు. 911 పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా సదాశివనగర్‌లో 126, రామారెడ్డిలో 113, మద్నూర్‌లో 81, తాడ్వాయిలో 49, రాజంపేటలో 48, లింగంపేటలో 76, దోమకొండలో 51 పెండింగ్‌లో ఉన్నాయి. అప్లికేషన్లు పెట్టి నెలలు గడుస్తున్నా.. కొలతలు చేయడం లేదని పలువురు రైతులు ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేస్తున్నారు. ప్రతీవారం రెవెన్యూ శాఖకు సంబంధించి 40కి పైగా అప్లికేషన్లు వస్తే ఇందులో 10 వరకు కొలతలవే ఉంటున్నాయి. పలుకుబడి ఉన్న, రియల్ఎస్టేట్భూములకు సంబంధించిన అప్లికేషన్లను మాత్రమే త్వరగా పరిష్కరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 22 మండలాలకు గాను 12 మంది సర్వేయర్లు ఉన్నారు. ఇందులో ప్రస్తుతం అయిదుగురు వివిధ కారణాలతో సెలవుల్లో ఉన్నారు. 7 గురు మాత్రమే పని చేస్తున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.
సిబ్బంది లేక సమస్య..
జిల్లాలో సర్వేయర్లు తక్కువగా ఉన్నారు. ఉన్న 12 మందిలో అయిదుగురు సెలవుల్లో ఉన్నారు. మిగిలిన ఏడుగురితోనే కొలతలు వేయిస్తున్నాం. మధ్యలో గవర్నమెంట్‌కు సంబంధించిన పనుల కోసం సర్వే చేయాల్సి వస్తోంది. ఈ నెలాఖరుకు సెలవుల్లో ఉన్న సర్వేయర్లు జాయినవుతారు. వారు వచ్చిన తర్వాత 2 మండలాలకు ఒకరి చొప్పున కేటాయించి పెండింగ్అప్లికేషన్లను పరిష్కరిస్తాం..
శ్రీనివాస్, జిల్లా సర్వే ల్యాండ్రికార్డ్ఆఫీసర్