ఇంటి నిర్మాణ పనులు ఆపుతున్నారని ఆందోళన .. మున్సిపల్ ఆఫీసును ముట్టడించిన బాధితులు

ఇంటి నిర్మాణ పనులు ఆపుతున్నారని ఆందోళన .. మున్సిపల్ ఆఫీసును ముట్టడించిన బాధితులు
  • పెట్రోల్ సీసాతో ఆత్మహత్యాయత్నం

 నిర్మల్, వెలుగు: మున్సిపల్ టీపీవో తన ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నాడంటూ ఆరోపిస్తూ నిర్మల్​జిల్లా కేంద్రంలోని సోమవార్ పేట్ ప్రాంతానికి చెందిన రమేశ్ అనే వ్యక్తి మున్సిపల్ కార్యాలయం ముందు కుటుంబసభ్యులతో కలిసి ఆందోళనకు దిగాడు. తాము ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకున్నప్పటికీ.. పనులను నిలిపి వేయాలంటూ టీపీవో షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ వేధిస్తున్నా డని ఆరోపించారు. బాధితుడు రమేశ్ పెట్రోల్ సీసా తీసుకొచ్చుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా స్థానికులు అడ్డుకున్నారు. 

ఆ కుటుంబానికి స్థానిక కౌన్సిలర్ మేడారం అపర్ణ మద్దతు తెలిపారు. బాధితులతో కలిసి మున్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కమిషనర్ కమర్ బాధితులతో మాట్లాడి ఆందోళన విరమించాలని కోరారు. కానీ తమకు స్పష్టమైన హామీ వచ్చేవరకు ఆందోళన విరమించేది లేదంటూ స్పష్టం చేశారు. దాదాపు 2 గంటల పాటు ఆందోళన చేశారు. అనంతరం అధికారుల హామీ వేరకు విరమించారు.