
హనుమకొండ, వెలుగు : స్టేషన్‌కు వచ్చే ప్రతి కేసులో పోలీస్ ఆఫీసర్ల పనితీరును సమీక్షిస్తామని, హద్దులు దాటి ప్రవర్తిస్తే సీరియస్ యాక్షన్ తప్పదని వరంగల్ సీపీ ఏవీ.రంగనాథ్ హెచ్చరించారు. వివిధ సమస్యలతో వచ్చే బాధితులకు స్టేషన్ స్థాయిలోనే న్యాయం చేయాలని సూచించారు. కేయూ కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు కేసులు నమోదు చేయొద్దని ఆదేశించారు.
ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. రౌడీయిజంతో పాటు చట్టవ్యతిరేక పనులకు పాల్పడే వ్యక్తులను నిత్యం గమనిస్తూ ఉండాలన్నారు. ఎస్సై స్థాయి నుంచి డీసీపీ స్థాయి ఆఫీసర్ల వరకు ఆకస్మిక తనిఖీలతో పాటు కార్డన్ సెర్చ్ నిర్వహించాలన్నారు. అనంతరం గత ఆరు నెలల్లో జరిగిన నేరాలు, నమోదైన కేసులు, వాటి ప్రస్తుత పరిస్థితి, అరెస్టుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీసీపీలు మురళీధర్, కరుణాకర్, సీతారాం, బారీ, పుష్ప, ట్రైనీ ఐపీఎస్
అంకిత్ పాల్గొన్నారు.