తుంగతుర్తిలో గెలుపు నాదే : మందుల సామెల్

తుంగతుర్తి, వెలుగు: రానున్న ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గ బీఆర్​ఎస్​ టికెట్​ తనదేనని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్​ మందుల సామేల్​ ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కోడూరులో ఆదివారం ఆయన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.  బీఆర్ఎస్ లో చురుకైన పాత్ర పోషిస్తూ సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి పనిని పూర్తి చేశాననన్నారు. తనపై పార్టీలో మంచి నమ్మకం ఉందని చెప్పారు.