మహిళల ఆశీస్సులతోనే కాంగ్రెస్ విజయం

లింగాల, వెలుగు : మహిళల ఆశీస్సులతో పార్లమెంట్​ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్  పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చామని తెలిపారు.

ఆర్థికంగా వెనకబడిన మహిళలకు ఏడాదికి రూ.లక్ష ఆర్థికసాయం చేస్తామన్నారు. పదేండ్లు బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. ఎంపీగా మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రంగినేని శ్రీనివాసరావు, మోపతయ్య, కొయ్యల శ్రీనివాసులు, శ్రీనివాస్ రాథోడ్  ఉన్నారు.