- ఉమ్మడి వరంగల్ లో సిట్టింగులపై ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థుల విజయం
వరంగల్, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లాలో చివర్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరు లీడర్లు అనూహ్యంగా విజయం సాధించి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు షాక్ఇచ్చారు. 2018 ఎన్నికల్లో వర్ధన్నపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేశ్ అత్యధికంగా 99 వేల మెజారిటీ సాధించారు. ఈసారి లక్ష మెజారిటీ వస్తుందని ఆశించారు. అయితే, ఎలక్షన్లకు కొద్ది రోజుల ముందే రిటైర్డ్పోలీస్కమిషనర్ కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వస్తూనే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పై గెలుపొంది రికార్డు సృష్టించారు. అలాగే నర్సంపేటలో నిన్నమొన్నటి వరకు బీజేపీ అభ్యర్థిగా రేవూరి ప్రకాశ్ రెడ్డి ఫీల్డ్ వర్క్ చేసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక కాంగ్రెస్ లో చేరారు. ఎవరూ ఊహించని విధంగా నర్సంపేట నుంచి పరకాల నియోజకవర్గానికి మారారు. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై రేవూరి విజయం సాధించి షాక్ ఇచ్చారు.