వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ స్టార్ట్

వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ స్టార్ట్

ఎఫ్‌‌‌‌ 2, ఎఫ్‌‌‌‌ 3 లాంటి రెండు హిలేరియస్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్స్‌‌‌‌ తర్వాత హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌‌‌‌లో మరో సినిమా రూపొందుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ రీసెంట్‌‌‌‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా, తాజాగా రెగ్యులర్ షూటింగ్‌‌‌‌ను స్టార్ట్ చేశారు. హైదరాబాద్‌‌‌‌లోని ప్యాలెస్‌‌‌‌లో  జరుగుతున్న షూటింగ్‌‌‌‌లో  మెయిన్ కాస్ట్ అంతా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో ఆకట్టుకుంది. 

సినిమాలో క్రైమ్ ఎలిమెంట్స్‌‌‌‌ని సూచించేలా  మ్యాసీవ్ గన్స్ సెట్‌‌‌‌లో ఉంచారు.  ఎక్స్ కాప్‌‌‌‌,  అతని ఎక్స్‌‌‌‌లెంట్‌‌‌‌ వైఫ్‌‌‌‌, ఎక్స్‌‌‌‌ గర్ల్‌‌‌‌ ఫ్రెండ్ చుట్టూ తిరిగే ఈ ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌లో..  వైఫ్‌‌‌‌గా ఐశ్వర్య రాజేష్, గర్ల్‌‌‌‌ ఫ్రెండ్‌‌‌‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్

నరేష్, వీటీ గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.  భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.