హిట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌తో విక్టరీ వెంకటేష్‌‌‌‌

హిట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌తో విక్టరీ వెంకటేష్‌‌‌‌

‘ఎఫ్3’ సినిమా తర్వాత ‘రానా నాయుడు’ వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌తో బిజీ అయిన వెంకటేష్‌‌‌‌.. నెక్స్ట్ మూవీ ఎవరి డైరెక్షన్‌‌‌‌లో చేయబోతున్నారా అనే ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఆయన కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 75వ సినిమా. ఈ కొత్త సినిమాను నిన్న ప్రకటించారు. ‘హిట్‌‌‌‌’ ఫ్రాంచైజీలో రెండు సినిమాలు తీసి విజయాలు అందుకున్న శైలేష్‌‌‌‌ కొలను.. దీన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. నానితో ‘శ్యామ్ సింగరాయ్‌‌‌‌’ తీసిన వెంకట్‌‌‌‌ బోయనపల్లి నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్‌‌‌‌ పోస్టర్‌‌‌‌ను కూడా విడుదల చేశారు. 

దట్టమైనపొగ మధ్య ఏదో పేలుడుకు ఎదురెళ్తున్నట్టుగా, షర్ట్ చేయి మడిచి ముందుకెళ్తున్న వెంకటేష్ సిల్హౌట్ ఇమేజ్ కనిపిస్తోంది. ఆయన లుక్‌‌‌‌ను బట్టి ఇదో యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ అని అర్థమవుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌తో రూపొందే ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో వెంకటేష్‌‌‌‌ను చూపించబోతున్నామని, ఆయన కెరీర్‌‌‌‌‌‌‌‌లోనే భారీ బడ్జెట్‌‌‌‌తో తెరకెక్కిస్తామని మేకర్స్ చెబుతున్నారు. నటీనటులు, టెక్నీషియన్స్‌‌‌‌ వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఈనెల 25న పూర్తి వివరాలతో మరో అనౌన్స్‌‌‌‌మెంట్ రానుంది.