ఎన్నికల ప్రచారంలో వెంకీ మామ.. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని రోడ్ షో

ఎన్నికల ప్రచారంలో వెంకీ మామ.. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని రోడ్ షో

లోక్ సభ ఎలక్షన్స్ లో భాగంగా ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఖమ్మం అభ్యర్థి రామసహయం రాఘురామ్ రెడ్డి గెలుపునకు హీరో దగ్గబాటి వెంకటేష్ ప్రచారంలో పాల్గొన్నారు. ఖమ్మంలోని మయూరి సెంటర్ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్ వరకు వెంకటేష్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటితో సహా కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. 

రోడ్ షోలో వేసిన బల్పంబట్టి బామ్మవల్లో పాటకు మంత్రి పొంగులేటి, హీరో విక్టరీ వెంకటేష్ స్టెప్పులేశారు.. కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. విక్టరీ వెంకటేష్ కూతుర్ని రఘురామ్ రెడ్డి కొడుకుకు ఇచ్చి పెళ్లి చేశారు. దీంతో ఇద్దరు వియ్యంకులవుతారు. ఈ క్రమంలోనే తన బావ గెలవాలని విక్టరీ వెంకటేష్ ఎన్నికల ప్రచారంలోకి దిగారు. మరోవైపు విక్టరీ కూతురు కూడా ప్రచారం చేస్తుంది. మామను గెలిపించాలని కోరుతూ ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు.