సంక్రాంతికి క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్‌తో ఆడియెన్స్ ముందుకొస్తున్నాం అని అన్నారు వెంకటేష్. ఆయన హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం జనవరి 14 సంక్రాంతి రోజున విడుదలవుతోంది. ఈ సందర్భంగా వెంకటేష్ ఇలా ముచ్చటించారు.
ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్.. ఈ లైనే చాలా ఫ్రెష్‌గా అనిపించింది. మినిమం గ్యారెంటీ అని అక్కడే తెలిసిపోయింది. పెర్ఫార్మెన్స్ వైజ్ ఇందులో కామెడీ స్టయిల్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా కొత్తగా ట్రై చేశాం. ఫ్రెష్ సీన్స్ ఉంటాయి. అవుట్‌పుట్ బాగా వచ్చింది. అనిల్ నా క్యారెక్టర్ చెప్పినప్పుడు - చాలా సరదాగా అనిపించింది. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి.. ‘నా గురించే ఆలోచిస్తున్నావా.. నేను వచ్చే లోపల నలుగురిని కన్నావ్..’ అన్నప్పుడు చాలా హిలేరియస్‌గా అనిపించింది. అలాంటి సీన్స్ చేయడం చాలా ఎంజాయ్ చేశా. ఇందులో నాకు నలుగురు పిల్లలు. అందులో ఒకడిని చాలా హ్యాండిల్ చేయాల్సివచ్చింది(నవ్వుతూ).
హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ -ఇద్దరూ చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. ఐశ్వర్య నాకు భార్యగా నటిస్తే, మీనాక్షి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌గా నటించింది. వారి పాత్రలు క్రేజీగా ఉంటాయి. క్లైమాక్స్‌లో చెప్పే డైలాగ్స్‌కు విజిల్స్ పడతాయి. యూత్ అయితే ఆ డైలాగ్స్‌కి కనెక్ట్ అవుతారు. అనిల్‌ది నాది సూపర్ హిట్ కాంబినేషన్. మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. తను స్టోరీపై క్లారిటీగా ఉండటంతో డెబ్బై రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాం. ఫాస్ట్‌గా ఫినిష్ చేయడం హ్యాపీగా అనిపించింది. అనిల్‌తో మరిన్ని మూవీస్ చేయాలనుంది.
ఈసారి ప్రమోషన్స్ ఎనర్జిటిక్‌గా చేయడానికి భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్కే కారణం. కొన్ని ట్యూన్స్ వినగానే క్రేజీగా అనిపించింది. అలాగే డైరెక్టర్ అనిల్, ఇద్దరు హీరోయిన్స్.. లైవ్లీ టీం కుదిరింది. ప్రమోషన్స్‌లో ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నాం. ప్రమోషన్స్‌ని కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం హ్యాపీగా ఉంది. అలాగే రమణ గోగులతో పాటు నేను పాడిన పాటకు మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. ప్రతి సినిమా నా సొంత సినిమాగా చేస్తాను. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. సిన్సియర్ గా పని చేస్తాను. దిల్ రాజు గారి ప్రొడక్షన్ సీతమ్మ వాకిట్లో నుంచి ట్రావెల్ అవుతున్నా. వారితో జర్నీ చాలా కంఫర్ట్‌గా ఉంటుంది.
నా కెరీర్ లో ఇది మరో సంక్రాంతి. ఒక క్లీన్ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్‌తో రావడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలు, పెద్దలు, యూత్ అందరూ ఎంజాయ్ చేస్తారు. నానుంచి సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ బాగా ఆడాయి. ఈ సినిమా కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది.