Sankranthiki Vasthunam: ఈ విజయం కలా? నిజమా?.. మూతబడిన థియేటర్లని కళకళలాడించింది: విక్టరీ వెంకటేష్

Sankranthiki Vasthunam: ఈ విజయం కలా? నిజమా?.. మూతబడిన థియేటర్లని కళకళలాడించింది: విక్టరీ వెంకటేష్

విక్టరీ వెంకటేష్ (Venkatesh) సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)  సినిమా సక్సెస్ ఈవెంట్ ఘనంగా జరిగింది. సోమవారం రాత్రి (ఫిబ్రవరి 10న) హైదరాబాద్‌ జెఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో 'సంక్రాంతికి వస్తున్నాం' విక్టరీ సెలెబ్రేషన్ వేడుక కనువిందు చేసింది. ఈ విజయోత్సవ సభకు టాలీవుడ్ దర్శకులు కె.రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, వశిష్ఠ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా హీరో వెంకటేష్ మాట్లాడిన స్పీచ్ అదిరిపోయింది. తన సినిమాలోని ఓ మరుపురాని కవితతో తన స్పీచ్ షురూ చేస్తూనే ఆసక్తి కలిగించాడు. ‘దేవుడా ఓ మంచి దేవుడా... అంటూ తన డైలాగ్‌తోనే ప్రసంగాన్ని మొదలుపెట్టి, తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ నుంచి కెరీర్‌లో తనకి దక్కిన విజయాల్ని గుర్తు చేసుకున్నారు. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాతో వస్తే చూసి విజయాన్ని అందించాలని ప్రేక్షకులు బలంగా కోరుకున్నారు. అందుకే చరిత్ర లిఖించే విజయాన్ని అందించారని గుర్తుచేసుకున్నారు వెంకటేష్.

ALSO READ | శ్రీ విష్ణు సింగిల్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల

అయితే, సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్‌ అవుతుందని ఊహించాం. కానీ ఇంతగా ప్రేక్షకుల హృదయాల్లోకి వెళ్తుందనుకోలేదు. ఊహలకు మించి ఈ సినిమా ప్రేక్షకులకు చేరువైంది. ఐదు.. పదేళ్లుగా థియేటర్‌కి వెళ్లనివాళ్లు కూడా ఈ సినిమా కోసం వెళ్లారు. ఈ విజయం కలా? నిజమా? అనేది కూడా అర్థం కావడం లేదు. 

మూతబడిన థియేటర్లని కూడా కళకళలాడించిందీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా. అందుకు సినీ ప్రేమికులు, పరిశ్రమకి కృతజ్ఞతలు తెలిపారు వెంకటేష్. 2027లో మళ్లీ సంక్రాంతికి వస్తాం. రికార్డులు కొట్టడానికి కాదు. ప్రేక్షకులకు వినోదం పంచడమే నాకు ముఖ్యం అన్నారు వెంకీ.

ఇకపోతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.303 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది. కేవలం 20 రోజుల్లోగానే రూ.303 కోట్లు సాధించి అదరగొట్టేసింది. దాదాపు రూ.178.95 కోట్లకి పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. ఇప్పటికీ ఈ సినిమా లాంగ్ రన్ను కొనసాగిస్తోంది.