సంక్రాంతికి వచ్చాం.. హిట్ కొట్టాం : వెంకటేష్

సంక్రాంతికి వచ్చాం.. హిట్ కొట్టాం : వెంకటేష్

వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై  రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌‌‌‌తో ఇప్పటికీ థియేటర్స్‌‌‌‌లో  హౌస్‌‌‌‌ఫుల్ అవుతూ సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ భీమవరంలో బ్లాక్ బస్టర్ సంబరం ఈవెంట్‌‌‌‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు హాజరై టీమ్‌‌‌‌ను అభినందించారు.  వెంకటేష్ మాట్లాడుతూ ‘నా కెరీర్‌‌‌‌‌‌‌‌లోనే  బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్యూ. సంక్రాంతికి వచ్చాం.. కొట్టాం. 

మీ ప్రేమ ఇలానే ఉంటే మళ్లీ సంక్రాంతికి వస్తాం. మరో బ్లాక్ బస్టర్ ఇస్తాం’ అని చెప్పారు. ఈ విజయాన్ని మర్చిపోలేం అని హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి అన్నారు. ‘సినిమా పెద్ద హిట్ అయితే చాలు అనుకున్నాం. కానీ ఆడియెన్స్ ఎక్కడికో తీసుకెళ్లి పెట్టారు’ అని అనిల్ రావిపూడి అన్నాడు. నిర్మాత శిరీష్, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో పాల్గొన్నారు.