ఇవాళ ఖమ్మానికి విక్టరీ వెంకటేశ్​

ఇవాళ ఖమ్మానికి విక్టరీ వెంకటేశ్​

ఖమ్మం టౌన్, వెలుగు: సినీ హీరో విక్టరీ వెంకటేశ్​ఈ నెల 7న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు టూర్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తుంబూరు దయాకర్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తన వియ్యంకుడు, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘు రాంరెడ్డి  గెలుపు కోసం ఆయన ప్రచారం చేసేందుకు వస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 5గంటలకు ఖమ్మం మయూరి సెంటర్ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్ వరకు జరిగే రోడ్ షో లో పాల్గొంటారన్నారు. అనంతరం రాత్రి 8గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం క్లబ్ లో జరిగే పుర ప్రముఖుల సమ్మేళనంలో పాల్గొంటారని పేర్కొన్నారు.