Vidaamuyarchi day 2 collection: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా నటించిన పట్టుదల (తమిళ్ డబ్బింగ్) గురువారం రిలేజ్ అయింది. ఈ సినిమాలో అజిత్ కుమార్ కి జోడీగా ప్రముఖ హీరోయిన్ త్రిష నటించగా యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా కసాండ్రా, ఆరవ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ఈ సినిమాకి కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించగా, స్టార్ ఫిలిమ్ డైరెక్టర్ సుభాస్కరన్ నిర్మించాడు. అయితే రిలీజ్ రోజుపట్టుదల సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ దాదాపుగా రూ.26 కోట్లు (నెట్) కలెక్ట్ చేసింది. కానీ రెండో రోజుం మాత్రం కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయినట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ కలెక్షన్స్ అప్డేట్స్ ప్రకారం 2వ రోజు పట్టుదల సినిమా రూ. 8.75 కోట్లు (నెట్) కలెక్ట్స్ చేసినట్లు సమాచారం. ఇందులో తమిళ్ లో మాత్రమే రూ.8 కోట్లు కలెక్ట్ చెయ్యగా తెలుగులో రూ.70 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read :- మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ రాబట్టిన తండేల్
అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాదాపుగా రూ.95 కోట్లు పైగా ఉంది. కానీ ఇప్పటివరకూ పట్టుదల సినిమా రూ.36.75 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. అయితే తమిళ్ అజిత్ సినిమాకి పోటీ లేకపోయినప్పటికీ తెలుగులో తండేల్ సినిమా ఉండటంతో కలెక్షన్స్ రాబట్టలేకపోతోంది. కానీ రెండో శనివారం, ఆదివారంతో లాంగ్ వీకెండ్ ఉండటంతో కొంతమేర కలసి వస్తోంది. అయితే కలెక్షన్స్ పెరగపోతేమాత్రం బ్రేక్ ఈవెన్ కూడా కష్టమేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే హీరో అజిత్ కి తమిళ్ తోపాటూ తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. కానీ పట్టుదల సినిమాముని సరిగ్గా ప్రమోట్ చేసుకోకపోవడంతో పెద్దగా బజ్ లేదు. దీంతో టాలీవుడ్ లో జీరో బజ్ తో రిలీజ్ అయిన ఈ సినిమాకి కలెక్షన్స్ కూడా పెద్దగా రావడం లేదు. మరోవైపు స్టోరీలో ల్యాగ్ ఉండటం, అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ నిరాశపర్చడం, డైరెక్టర్ మగిజ్ తిరుమేని టేకింగ్ సరిగ్గా లేకపోవడంతో పెద్దగా టికెట్లు తెగడం లేదు.