
కేరళ, విదర్భ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ చివరి దశకు చేరుకుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మ్యాచ్ పూర్తిగా విదర్భ చేతిలోకి వచ్చింది. కరుణ్ నాయర్ సెంచరీ చేయడంతో పాటు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ హీరో డానిష్ మాలేవర్(73) హాఫ్ సెంచరీ తోడవడంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ నాలుగు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (132), అక్షయ్ వాడ్కర్ (4) క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం విదర్భ 286 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఒక రోజు ఆట మాత్రమే మిగిలి ఉండడంతో ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ALSO READ : అఫ్ఘన్లను అత్యాశ దెబ్బతీస్తోంది.. మేలుకుంటే రాబోయే రోజుల్లో వారిదే పెత్తనం: డేల్ స్టెయిన్
మ్యాచ్ డ్రా అయితే తొలి ఇన్నింగ్స్ లో ఎక్కువ స్కోర్ చేసిన విదర్భను టైటిల్ విజేతగా నిలుస్తారు. రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్ కు చేరిన కేరళ అద్భుతంగా పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరి రోజు వేగంగా విదర్బ 6 వికెట్లు తీయడంతో భారీ స్కోర్ ఛేజ్ చేయాల్సి ఉంది. ఒక రోజులో ఇది సాధ్యపడేలా కనిపించడం లేదు. నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ 7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కరుణ్ నాయర్ (120*), డానిష్ మాలేవర్ (73) మూడో వికెట్ కు 182 పరుగులు జోడించి మ్యాచ్ ను విదర్బ చేతుల్లోకి తీసుకొచ్చారు.
కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 125 ఓవర్లలో 342 రన్స్‌కు ఆలౌటైంది. దాంతో విదర్భకు 37 రన్స్ ఆధిక్యం లభించింది. కెప్టెన్ సచిన్ బేబీ (98), ఆదిత్య సర్వాటే (79) పోరాడినా కేరళను ఆధిక్యంలోకి తీసుకురాలేకపోయారు. అహ్మద్ ఇమ్రాన్ (37), మహ్మద్ అజారుద్దీన్ (34), జలజ్ సక్సేనా (28), సల్మాన్ నిజార్ (21) కూడా పోరాడారు. విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కాండే, హర్ష్ దూబే, పార్థ్ రేఖడే తలో మూడు వికెట్లు పడగొట్టి కేరళను ఆలౌట్ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో విదర్భ 379 రన్స్‌కు ఆలౌటైన సంగతి తెలిసింది.