
- తొలి ఇన్నింగ్స్‌లో 308/5
- రాణించిన షోరే, డానిష్
నాగ్‌పూర్, అహ్మదాబాద్: రంజీ ట్రోఫీలో బలమైన ముంబైతో సెమీఫైనల్ మ్యాచ్‌ను విదర్భ మెరుగ్గా ఆరంభించింది. డానిశ్ మలేవార్ (79), ధ్రువ్ షోరే (74) సత్తా చాటడంతో సోమవారం మొదలైన మ్యాచ్‌లో తొలి రోజు ఆ జట్టు హవానే నడిచింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన విదర్భ 308/5 స్కోరుతో తొలి రోజు ముగించి భారీ స్కోరు దిశగా ముందుకెళ్తోంది.
ఓపెనర్ అథర్వ తైడే (4) నిరాశపరిచినా.. మరో ఓపెనర్ ధ్రువ్ షోరే, మలేవార్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. ఫామ్‌లో ఉన్న కరుణ్ నాయర్ (45)కూడా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం యశ్ రాథోడ్ (47 బ్యాటింగ్), కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ముంబై బౌలర్లలో శివం దూబే, శామ్స్ ములానీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
కేరళ 206/4
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో మొదలైన సెమీస్‌లో టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన కేరళ 206/4తో తొలి రోజు ముగించింది. కెప్టెన్ సచిన్ బేబీ (69 బ్యాటింగ్) సత్తా చాటాడు. ఓపెనర్లు అక్షయ్ చంద్రన్ (30), రోహన్ (30), జలజ్ సక్సేనా (30) ఫర్వాలేదనిపించారు. ప్రస్తుతం సచిన్ బేబీకి తోడు మొహమ్మద్ అజరుద్దీన్ (30 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.