నిజామాబాద్ లో న్యూడ్ కాల్స్ దందా : ట్రాప్ లో పడ్డారా అంతే..

  • హస్కీ వాయిస్​తో మాట్లాడి నిండా ముంచేస్తారు
  • అప్రతమత్తంగా లేకపోతే అంతే సంగతులు

ఆర్మూర్, వెలుగు:  ఓ వ్యక్తి  తన ఫేస్​బుక్​, ఇన్​స్టా, వాట్సాప్​లో హ్యాండ్​సమ్​గా దిగిన ఫొటోను ప్రొఫైల్ పిక్​గా పెట్టుకున్నాడు. చాలా రోజులుగా ఇలాంటి ప్రొఫైల్ పిక్​గా పెట్టుకున్న వారిని ఆగంతకుల ముఠా గమనించి అలాంటి వాళ్లకు  వీడియో కాల్ చేస్తున్నారు. అవతలి నుంచి వీడియోకాల్ చేసిన అమ్మాయి పూర్తి న్యూడ్ గా ఉండి  హిందీ, ఇంగ్లీష్ లో హస్కీ వాయిస్​తో  మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది. అలానే  ట్రాప్ లోకి దించేసి ఇవతల మాట్లాడుతున్న  వాళ్ల వీడియోను రికార్డు చేస్తారు.

వాళ్ల మత్తులో మునిగితే వరుసగా న్యూడ్ కాల్స్ వస్తాయి. ప్రతీరోజు న్యూడ్ కాల్స్ చేసిన అమ్మాయిలు మాట్లాడుతూనే తెలియకుండానే వీడియోలు రికార్డు చేస్తారు. ఇక  ఆ తరువాత  బెదిరింపు కాల్స్​ వస్తాయి. మీరు న్యూడ్ గా మాట్లాడిన వీడియోస్ మా దగ్గర ఉన్నాయి, మేము అడిగిన డబ్బులు ఇస్తే ఓకే, లేకుంటే  యూట్యూబ్ లో ఈ వీడియోలు  పోస్ట్​ చేసి వైరల్ చేస్తామని బెదిరిస్తారు. ఇటీవల జిల్లాలో  ఇలాంటి న్యూడ్ కాల్స్ చేసి చీటింగ్​ చేసిన తతంగాలు ఒక్కొక్కటిగా  బయట పడతున్నాయి.

బయటకు చెప్పుకోలేక..

జిల్లాలో అనేకచోట్ల న్యూడ్ కాల్స్ బాధితులు కనిపిస్తున్నారు. న్యూడ్ కాల్స్ చేసే ముఠా చేసిన ఆపరేషన్ లో చిక్కి కక్కలేక, మింగలేక  మదనపడుతున్నారు. కొందరైతే వారికి లక్షల్లో డబ్బులు ఇచ్చుకున్నారు. ఇటీవల నిజామాబాద్, డిచ్​పల్లికి చెందిన నాయకులు, ఆర్మూర్ కు చెందిన  కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు,  ప్రముఖులు న్యూడ్ కాల్స్ ముఠా ఉచ్చులో చిక్కుకుపోయినట్లు తెలిసింది. 

రెండు రోజుల క్రితం  జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యాపారికి అర్ధరాత్రి న్యూడ్ కాల్ వచ్చింది. జడుసుకున్న ఆ వ్యాపారి వెంటనే ఫోన్ కట్​ చేశాడు. మళ్లీ న్యూడ్ కాల్ రాగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్​ చేశాడు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో విషయం బయటపడింది.

అప్రమత్తంగా ఉండాలి

సైబర్ నేరాలు జరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలి. మోసాలు, నేరాలు చేసేందుకు సైబర్ ముఠాలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి.  ​వీటిపై పోలీస్ శాఖ ద్వారా   ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. న్యూడ్ కాల్స్ చేసి మోసం చేసే వారి వలలో చిక్కుకోవద్దు.  ఆన్ లైన్ లో వచ్చే అనవసరమైన లింక్ లు ఓపెన్ చేయవద్దు. రాత్రిపూట నెట్ ఆఫ్ చేసుకుంటే చాలా మంచిది. న్యూడ్ కాల్స్ బాధితుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు   రాలేదు. 
 -సురేశ్​బాబు, ఎస్ హెచ్ ఓ, ఆర్మూర్