వీడి తెలివి తెల్లారా : చొక్కాపై చొక్కా.. 30 వేశాడు.. ఫ్లయిట్ ప్యాసింజర్ ఐడియా ఇదీ

వీడి తెలివి తెల్లారా : చొక్కాపై చొక్కా.. 30 వేశాడు.. ఫ్లయిట్ ప్యాసింజర్ ఐడియా ఇదీ

అమ్మో.. అమ్మో.. మనుషుల తెలివి తేటలు మామూలుగా లేవు.. రోజు రోజుకు కొత్త కొత్త ఐడియాలతో మైండ్ బ్లాంక్ చేస్తున్నారు. విమానం ఎక్కే సమయంలో లగేజీకి లిమిట్ ఉంటుంది.. ఇన్ని కిలోల కంటే ఎక్కువ తీసుకెళితే అదనపు ఛార్జీలు చెల్లించాలి.. దీంతో ఓ ప్రయాణికులు అదనపు లగేజీ ఛార్జీలను తప్పించుకునేందుకు.. ఏకంగా చొక్కా పై చొక్కా.. ప్యాంట్ పై ప్యాంట్ అన్నట్లు.. ఏకంగా 30 జతల బట్టలు ధరించాడు.. విమానం ఎక్కి.. సీట్లో కూర్చునే సమయంలో అవన్నీ విప్పి లగేజీ బాక్సులో సర్దేశాడు.. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ వైరల్ అయ్యింది. ఆ వివరాలు ఓసారి చూద్దామా... ఓ జాకెట్ వేసుకున్న ప్యాసెంజర్ లగేజి బ్యాగ్ ఫ్లైట్ లోకి ఎంటరయ్యాడు. అందరిలాగా మామాలుగానే లగేజి బ్యాగ్ పైన ఉన్న డెస్క్ లో  పెట్టాడు.

లగేజి బ్యాగ్ ను డెస్క్ లో పెట్టడం వరకు బాగానే ఉంది. ఆ తర్వాత మొదలైంది అసలు కథ, ముందు తాను వేసుకున్న జాకెట్ విప్పి లగేజి బిన్ లో పెట్టాడు. ఫ్లైట్ జర్నీలో కంఫర్ట్ గా ఉండదని జాకెట్ తీసేసాడేమో అనుకున్నారు పాసెంజర్లు. ఆ తరవాత ఒకదాని తర్వాత ఒకటి తీస్తూనే ఉన్నాడు.మయసభలో ద్రౌపది చీరల లాగా వరుసగా చొక్కాలు విప్పుతూనే ఉన్నాడు సదరు వ్యక్తి. దీంతో తోటి పాసెంజర్లంతా అవాక్కయ్యారు.

ఈ తంతుని ఒక పాసెంజర్ రికార్డ్ చేసి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అతని తెలివితేటలు చూసి షాక్ తిన్న నెటిజన్లు వీడు లెజెండ్ రా బాబు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొంత మంది ఈ ట్రిక్ ఎదో బాగానే ఉంది మనం కూడా ఫాలో అవ్వాలంటూ కామెంట్ చేస్తున్నారు.కాగా, చాలా మంది నెటిజన్లు లాఫ్టర్ ఎమోజిలతో రియాక్ట్ అవుతూ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.