కాళ్లపై బురద పడిందని.. తుడుపించుకున్న లేడీ పోలీస్

భోపాల్: రద్దీ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఎప్పుడూ సమస్యగానే ఉంటుంది. జనాలు ఎక్కువగా ఉన్న చోట వాహనాలను నిలపడం, వెహికిల్స్ ను వెనక్కి తీయడం ఇబ్బందనే చెప్పాలి. ఇలాంటి చోట్ల వాహనదారులకు మధ్య గొడవలు కూడా జరుగుతుంటాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటనే మధ్య ప్రదేశ్ లోని రీవాలో చోటు చేసుకుంది. పార్కింగ్ చేసిన బైక్ ను యువకుడు వెనక్కి తీసే క్రమంలో పక్కనే ఉన్న మహిళా పోలీసు కానిస్టేబుల్ పై బురద పడింది. దీంతో ఆమె సీరియస్ అయ్యింది. తన ప్యాంటు మీద పడిన బురదను  ఆ యువకుడితో బలవంతంగా శుభ్రం చేయిందింది. అంతేగాక అతడ్ని చెంపదెబ్బ కూడా కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువకుడితో కానిస్టేబుల్ ప్రవర్తించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఆ మహిళా కానిస్టేబుల్ ను శశికళగా గుర్తించారు. ఆమె కలెక్టర్ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. 

యువకుడ్ని మహిళా కానిస్టేబుల్ కొట్టిన వీడియో వైరల్ కావడంతో దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఈ వీడియోను తాము చూశామని, యువకుడితో ప్యాంటును బలవంతంగా శుభ్రం చేయించినట్లుగా గుర్తించామని రేవా ఏఎస్పీ శివ కుమార్ అన్నారు. ఈ ఘటనపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తాము దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

సారీ సైనా.. కావాలని కామెంట్ చేయలే

నితిన్ గడ్కరీకి మరోసారి కొవిడ్ పాజిటివ్

మోడీ పంజాబ్ ఘటన.. సుప్రీం రిటైర్డ్ జడ్జీతో దర్యాప్తు