ఐదేళ్ల వయస్సులోనే మొబైల్ కు బానిస.. నిద్రలోనూ వీడియోలు స్క్రోల్ చేస్తూ..

పిల్లలు మారాం చేస్తున్నా.. అన్నం తినకపోయినా.. గొడవ చేస్తున్నా.. అల్లరి చేస్తున్నా.. నేటి సమాజంలోని తల్లిదండ్రులకు ఒకటే పరిష్కారం.. చేతిలో మొబైల్ ఫోన్ పెట్టి తమ పనులు తాము చేసుకోవటం.. దీంతో చిన్న వయస్సులోనే పిల్లలు సెల్ ఫోన్ కు బానిస అవుతున్నారు. ఎంతలా అంటే మొబైల్ ఫోన్ ఇవ్వకపోతే అల్లరి చేసేంతగా.. కొంచెం పెద్దోళ్లు అయితే ఫోన్ ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్లింది పరిస్థితి. ఇందుకు సాక్ష్యమే ఈ వీడియో.. ఐదేళ్ల పిల్లోడు.. నిద్రలో కూడా మొబైల్ లో వీడియో స్క్రోల్ చేస్తున్నట్లు బిహేవ్ చేయటం ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని షాక్ కు గురి చేస్తుంది. ఆ పిల్లోడిని కాదు.. అలా తయారు చేసిన ఆ పేరంట్స్ ను తిట్టిపోస్తున్నారు నెటిజన్లు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read :  హామీలు నెరవేర్చాలంటూ ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల నిరసన

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో  బాలుడు నిద్రలో ఏడుస్తూ.. మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నట్టు, స్క్రోల్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఆ బాలుడు ఎవరు అన్న విషయాలు మాత్రం వెల్లడి కాలేదు. ఈ వీడియో  వైరల్ కావడంతో ఇప్పటి వరకు దీనికి 1.2 మిలియన్ల వ్యూస్, 13 వేల కంటే ఎక్కువ లైక్స్ వచ్చాయి. సాంకేతికత పిల్లల్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో ఈ వీడియో తెలియజేస్తుందంటూ.. నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్స్ పెడుతున్నారు.

పిల్లలు మొబైల్ ఫోన్లకు అలవాటు పడి తమ విలువైన సమయాన్ని, బాల్యాన్ని వృథా చేసుకుంటున్నారని కొందరు రిప్లై ఇస్తున్నారు. ఇలాంటి పిల్లలు వాస్తవానికి, ప్రపంచానికి దూరంగా ఉంటారని, ఇది చాలా విచారకరం అంటూ మరి కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ప్రవర్తనను ప్రోత్సహించే కుటుంబాలను ఇంకొందరు విమర్శించారు. పిల్లలను పర్యవేక్షించని వారు తమ పిల్లలకు ఫోన్స్, టాబ్లెట్స్, ల్యాప్ టాప్స్.. ఇవ్వకండి అని మరొకరు సూచించారు.

https://twitter.com/voiceofworldco/status/1671403199377416193