
"కాశీలోని దేవాలయం నలబై రోజులు పాడుపడుతుంది. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. నీటి నుంచే విద్యుత్ వస్తుంది. పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు. పంది కడుపులో మనిషి పుడతాడు..." ఇవన్నీ వినడానికి వింతగా, నమ్మలేమన్నట్టుగా అనిపించినప్పటికీ బ్రహ్మం గారు చెప్పినట్టు ఇవన్నీ ఏదో ఒక సందర్భంలో నిజమయ్యాయి. ఇప్పుడు కూడా ఇదే తరహా వింత సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఇది చూసిన వారంతా ఇదే విచిత్రం అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఇలాంటి వింతలు చూస్తామనుకులేదు అంటూ తెగ విస్మయానికి గురవుతున్నారు. ఇంతకీ ఆ వింతేంటీ.. అంతగా విస్మయం కలిగించే సంఘటనేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియో.. ఒక సెలూన్‌లో ఒక అమ్మాయి తన ముఖానికి షేవ్ చేసుకోవడం కనిపిస్తోంది. 15 సెకన్ల ఈ క్లిప్ లో సెలూన్‌లో కూర్చున్న అమ్మాయిని చూపిస్తుంది. ఆమె ముఖం మీద షేవింగ్ క్రీమ్ రాసి... బార్బర్ ఆమెకు షేవింగ్ చేస్తున్నాడు. అలా అతను ఆమె గడ్డానికి షేవ్ చేశాడు. అతను పురుషులకు ఉపయోగించే బ్లేడ్‌నే ఉపయోగిస్తూ ఈ షేవ్ చేయడం అందర్నీ షాక్ కు గురి చేస్తోంది.
ఈ క్లిప్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా, అది ఇప్పుడు వైరల్‌గా మారింది. దాంతో పాటు మార్పు అనేది ప్రకృతి నియమం అని క్యాప్షన్ లో రాసుకువచ్చారు. ఈ వీడియో చాలా మంది యూజర్స్ ను ఆశ్చర్యానికి గురి చేసింది. “మార్పు జరుగుతూనే ఉండాలి” అని ఒకరు కామెంట్ చేయగా... నవ్వు తెప్పిస్తోందంటూ మరికొందరు షాక్ అవుతూ.. తగిన ఎమోజీలను జోడిస్తున్నారు.
గత సంవత్సరం టిక్‌టాక్‌లోనూ ఇలాంటి వీడియోనే వైరల్ అయ్యింది. ఇందులో ఒక మహిళ తన ముఖాన్ని క్రమం తప్పకుండా షేవ్ చేసుకున్నట్లు వెల్లడించింది. రోజూ షేవింగ్ చేయడం చర్మానికి మంచిదని, ఇది ముఖంలోని మృతకణాలు, నూనెలను తొలగిస్తుందని, మేకప్‌ను మరింత సాఫీగా అప్లై చేయడంలో సహాయపడుతుందని ఆమె పేర్కొన్నారు. నా చర్మాన్ని మరింత మృదువుగా, సహజ సిద్ధంగా ఉండేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారామె. ఎందుకంటే.. షేవింగ్ చేసుకోవటం ద్వారా ఎలాంటి బ్యాక్టీరియా దరి చేరదు.. అదే విధంగా ఎలాంటి హాని చేయదు అని వివరించారామె. పురుషుల్లా షేవింగ్ చేసుకోవటం వెనక అనేక ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయనేది ఆమె బలంగా నమ్మటం ద్వారానే.. ఆమె సెలూన్ కు వెళ్లి మరీ.. మగాళ్లగా షేవింగ్ చేయించుకుంటుంది.. ఇదీ అసలు సంగతి..
बदलाव प्रकृति का नियम है। ?? pic.twitter.com/HjAeu4kUOv
— Cyber Huntss (@Cyber_Huntss) August 3, 2023