ఐకాన్ స్టార్ క్రేజ్: పుష్ప స్టెప్ తో అదరగొట్టిన యువకుడు.. వీడియో వైరల్

ఐకాన్ స్టార్ క్రేజ్: పుష్ప స్టెప్ తో అదరగొట్టిన యువకుడు.. వీడియో వైరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు తెచ్చి పెట్టిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా క్రేజ్ సంపాదించింది.ప్రస్తుతం పుష్ప2 సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఆగస్టు 15న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్ సాంగ్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్ క్యాచీగా ఉండటమే కాకుండా స్టెప్స్ కూడా హైలైట్ అయ్యాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by D J Madhu (@name_is_djmadhu)

సోషల్ మీడియాలో పుష్ప సాంగ్ స్టెప్స్ వైరల్ గా మారాయి.ఫ్యాన్స్ నుండి సోషల్ మీడియా సెలెబ్రిటీల వరకు అందరు ఈ స్టెప్స్ ని రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో యువకుడు గ్రూప్ డాన్సర్స్ తో కలిసి చేసిన పుష్ప కవర్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 1లక్ష76వేల లైకులతో ఇన్స్టాగ్రామ్ లో ట్రేండింగ్ లో ఉంది.