వెరైటీ: చెట్టు వేర్ల ఆకృతిలో పాకుతున్న ఈ జీవి గురించి తెలుసా..!

వెరైటీ: చెట్టు వేర్ల ఆకృతిలో పాకుతున్న ఈ జీవి గురించి తెలుసా..!

సమస్త ప్రాణకోటికి నెలవు ఈ భూమి. ఈ భూమి మీద మనుషులే కాకుండా ఎన్నో అందమైన, ప్రత్యేక మైన జీవ జాతులు ఉన్నాయి. అందులో ఒక్కో జీవి ఒక్కో ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఆ ప్రత్యేక కోవకు చెందిన రిబ్బన్ వార్మ్ అనే అద్భుతమైన జీవికి బంధించిన ఓ వీడియో ఇటీవల షోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో స్లిమీ రిబ్బన్ వార్మ్ మనిషి చేతిలో పాకుతోంది. 

ప్రోబోస్సిస్ అని పిలువబడే చెట్టు వేర్ల లాంటి ఆకృతితో పాకుతుండడం ఈ జీవి ప్రత్యేకత. ఈ ప్రోబోస్సిస్‌ను రిబ్బన్ వార్మ్ తన ఎరను వల వేయడానికి ఉపయోగిస్తుంది. తర్వాత అది తన నోటి వైపు లాగి మొత్తం తినేస్తుంది. విశేషమేమిటంటే రిబ్బన్ పురుగులు వాటి పరిమాణం కంటే మూడు రెట్లు ఎక్కువ ఎరను పట్టుకుని తినగలవు. వీక్షకులను ఆకట్టుకుంటున్న ఈ వీడియో ఇప్పటికే లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది.