చేపలు.. ఇవి బలమైన పోషకాహారం.. కొన్ని రకాల మందులను చేపలను ఉపయోగించి తయారు చేస్తారు. చేపమందుకు దేశవ్యాప్తంగా ఆదరణ ఉంది. అయితే ఇప్పుడు చేపలు.. బాతుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఒక పాత్రలో కొన్ని చేపలు ఉన్నాయి. ఆ పాత్ర దగ్గరకు ఓ బాతు ఎగురుకుంటూ వచ్చింది. మంచి ఆకలితో ఉందో ఏమో కాని.. చేపను ముక్కుతో తీసుకొని నోట్లో వేసుకుంది. కనీసం ముక్కలు కూడా చేయలేదు. ఏకంగా చేపనే మింగింది. ఇలా మింగుతూ ఆపాత్రను ఖాళీ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్ గా మారింది.
OMG ?pic.twitter.com/yiqBjmUbtK
— Figen (@TheFigen_) July 28, 2023
ఈ వీడియోను ట్విట్టర్ యాజర్ @TheFigen ద్వారా మైక్రోబ్లాగింగ్ సైట్‌లో శుక్రవారం ( జులై 28)పోస్ట్ చేశారు. వార్త రాసే సమయానికి 3.9 మిలియన్ల వీక్షణలను పొందింది. చాలామంది లైక్ చేస్తూ కామెంట్లు పోస్ట్ చేశారు. నెమ్మదిగా తినమని ఒకరు పోస్ట్ చేయగా మరొకరు పాపం బాతు ఆకలితో ఉందని కామెంట్ చేశారు. ఇంకొందరు ఇష్టమైన ఆహారం ఉన్నప్పుడు లొట్టలేసుకుంటూ లాగిస్తాం అని పోస్ట్ పెట్టారు. చైనీస్ బఫే అని కొందరనగా ...ఉపవాసం తరువాత రోజు కాబోలు... అంటూ నెటిజన్లు కామెంట్ చేశారు.