హైదరాబాద్ రోడ్లపై SRH ప్లేయర్స్.. లోకల్ బాయ్స్లా నడుస్తున్న వీడియో వైరల్

హైదరాబాద్ రోడ్లపై SRH ప్లేయర్స్.. లోకల్ బాయ్స్లా నడుస్తున్న వీడియో వైరల్

మేము లోకల్.. పక్కా లోకల్ అన్నట్లుగా సరదాగా హైదరాబాద్ రోడ్లపై  SRH ప్లేయర్స్ నడుచుకుంటూ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ అభిమాన క్రికెటర్లను చూసీ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. క్రికెటర్స్ అంటే ఒకవేళ బయటకు రావాల్సి వస్తే హై సెక్యూరిటీ, కాన్వాయ్ మధ్య వెళ్తుంటారు. కానీ ఏ సెక్యూరిటీ లేకుండా సరదాగా అలా వాకింగ్ చేస్తూ వెళ్తున్న వీడియో వైరల్ గా మారింది. 

Also Read :- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై..

IPL హైదరాబాద్ ఫ్రాంచైజీ  సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న పాట్ కమిన్స్ తో పాటు స్టార్ ఆటగాళ్లు మిచెల్ మార్ష్ , ఆడమ్ జంపా వంటి స్టార్ ప్లేయర్లు రోడ్లపై సాధారణ పౌరుల్లా నడుచుకుంటూ వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. శుక్రవారం (మార్చి 28) ఉదయం హోటల్ నుండి బయటకు వచ్చిన ఈ ఆటగాళ్లను చూసిన ఒక వ్యక్తి వెంటనే తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్న టైమ్ లో ప్లేయర్స్ హోటల్స్ లేదా స్టేడియానికే పరిమితమవుతారు. వారికి భారీ భద్రత కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో  స్టార్ ప్లేయర్లు ఇలా నగర వీధుల్లో ఎలాంటి హడావుడి లేకుండా, సాధారణంగా నడుచుకుంటూ వెళ్లడం ఎవరూ ఊహించని విషయం. ఈ వీడియో చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తమ అభిమాన ఆటగాళ్లను ఇంత దగ్గరగా, తమ నగర వీధుల్లో చూడటంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.