ముంబై మెట్రోలో మహిళ వల్గర్ డ్యాన్స్ ..రైల్వే శాఖ సీరియస్..

ముంబై మెట్రోలో మహిళ వల్గర్ డ్యాన్స్ ..రైల్వే శాఖ సీరియస్..

ఇటీవల కాలంలో రీల్స్ పిచ్చి బాగా ముదిరిపోయింది. యూత్ నుంచి వృద్ధుల వరకు రీల్స్ చేయడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కామన్ అయిపోయింది. కొందరు యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లుగా డబ్బు సంపాదించొచ్చన్ని అనుకుంటే..మరికొందరు దీంతో  పాటు ప్రపంచానికి తమ టాలెంట్ ను నిరూపించుకోవాలనే తపనతో కొందరు ఈ రీల్స్ చేస్తున్నారు. ఆన్ లైన్ నెటిజన్లు వీరిపై జోకులు, విమర్శలు చేస్తున్నా.. సీరియస్ యాక్షన్ తీసుకుంటామని రైల్వే అధికారులు పదే పదే హెచ్చరిస్తున్నా.. ఏమాత్రం పట్టించుకోకుండా.. రీల్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ముంబైలో కదులుతున్న లోకల్ ట్రైన్ లో భోజ్ పురి పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించిన వీడియోలపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

@mumbaimatterz యూజర్ నేమ్ లో ఈ వీడియోను X లో షేర్ చేశారు. దీన్ని GRPముంబై , DRM ముంబై ,రైల్వే మంత్రిత్వ శాఖకు ట్యాగ్ చేసి యువతిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి వీడియోలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ  యువతి ముంబై లోకల్ ట్రైన్‌లలో జనరల్ , లేడీస్ కోచ్‌ లు, CMST స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లో రెచ్చగొట్టేలా డ్యాన్స్ చేస్తూ ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినట్లు వీడియోలో కనిపిస్తోంది. 

ముంబై లోకల్ ట్రైన్లలో హ్యాకర్స్, బెగ్గర్స్.. ఇప్పుడు రీల్ మేకర్స్ ప్రయాణికులను ప్రశాంతంగా ప్రయాణించకుండా చేస్తున్నారని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. రై ల్వే అధికారులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని రాశారు. 

ఇక నెటిజన్లు ఆయువతి వల్డర్ డ్యాన్స్ పై కోపంగా ఉన్నారు. ఆమె ఇలాంటి డ్యాన్సులతో తోటి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారు. ఆమె డ్యాన్స్ చాలా అశ్లీలం గా ఉంది అని ఓ నెటిజన్ లేబుల్ చేశారు. ఇంకో నెటిజన్ స్పందిస్తూ.. ప్రజా రవాణలో ఇటువంటి బిహేవియర్ మంచిది కాదని వాదించారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలనిఇంకొందరు నెటిజన్లు  అధికారులను   కోరారు. 

Also read :భార్య లేదన్న బాధలో .. ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్

ఈ పోస్టలు ముంబైల్ సెంట్రల్ DRM ఎట్టకేలకు స్పందించారు. సమాచారం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.. ఆ యువతిపై అవసరమైన చర్యలు తీసుకుం టామని రిప్లై ఇచ్చారు.