డ్రంక్ అండ్ డ్రైవ్లో అపరిచితుడు..పోలీసులకు చుక్కలు చూపించిన యువకుడు

హైదరాబాద్: తాగి బండి నడపడమే నేరం అంటే.. మనోడు ఏకంగా రాళ్లతో దాడికి యత్నించి ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించాడు. అపరిచితుడు సినిమాలో హీరోలాగా మల్టిపుల్ పర్సనాలిటీలను పర్ఫార్మెన్స్ చేస్తూ హల్ చల్ చేశారు.పోలీసులపైనే దాడి చేసి.. పోలీసులు తననే బట్టలూడదీసి కొట్టారని నానా హంగామా చేశాడు. హైదరాబాద్ లో తాగి బైక్ నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కి క్రైం సీన్ క్రియేట్ చేసిన యువకుడి వీడియో సోషల్  మీడియాలో వైరల్ అవుతోంది.      

శనివారం ( నవంబర్ 23) రాత్రి చంపాపేట చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ యువకుడు  మద్యం తాగి బైక్ నడుపుతూ పట్టుబడ్డాడు. పోలీసులనుంచి తప్పించుకేనేందుక నానా రభస చేశాడు. 
నేను తాగిందే బీరు అంతమాత్రానా 90 శాతం చూపిస్తదా అని  పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. 

బట్టలు చించుకొని..పోలీసులు తనపై దాడి చేశారంటూ  అపరిచితుడు సినిమాలో హీరోల వింత వింత చేష్టలు చేశాడు. ఓ బండరాయితో పోలీసులపై దాడి చేసేందుకు వచ్చి.. ఆ తర్వాత పోలీసుల కాళ్లమొక్కడం వంటి మల్టీ స్ల్పిట్ పర్సనాలిటీలను పెర్ఫార్మెన్స్ చేశాడు. యువకుడి చేష్టలకు విస్తుపోయిన పోలీసులు కొంచెం తేరుకొని నవ్వుకున్నారు. 

ట్రాఫిక్ పోలీసులు యువకుడి డ్రామాలు అన్నీ రికార్డు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ఇంటర్నెట్ యూజర్లు.. అపరిచితుడు సినిమాలో హీరో విక్రమ్ ను మించి యాక్టింగ్  చేశాడని సెటైర్లు వేస్తున్నారు.