బీహార్‌లోని మోతిహారిలో ఓ విచిత్రమైన సన్నివేశం చోటుచేసుకుంది. బ్రిడ్జి కింద విమానం బాడీ ఇరుక్కుపోవడంతో రోడ్లపై ట్రాఫిక్ భారీ జామ్ అయింది. అనంతరం ట్రక్కు డ్రైవర్లు, స్థానికుల సహాయంతో విమానంలోని స్క్రాప్‌ను బయటకు తీశారు.
విమానాన్ని ముంబై నుంచి అస్సాంకు తీసుకెళ్తుండగా మోతీహారీకి చెందిన పిప్రకోఠి వంతెన కింద ఇరుక్కుపోయింది. 2022 నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలోనూ రోడ్డు అండర్‌పాస్‌పై విమానం ఇరుక్కుపోయినప్పుడు ఇలాంటి సంఘటనే జరిగింది. కొచ్చి నుంచి హైదరాబాద్‌కు విమానాన్ని ట్రక్కుపై తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.