
సోషల్ మీడియాలో రోజుకు కొన్ని లక్షల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూసినప్పుడు మాత్రం వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి వీడియో గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇన్స్టాగ్రాంలో ఒక పిల్లాడు పాముతో ఆడుకుంటున్న వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
అది కోరలు పీకేసిన పాము అయి ఉంటుందో.. లేదో పక్కన పెడితే ఆ వీడియో చూస్తే ఎవరికైనా గుండె గుబేలుమనడం ఖాయం. రబ్బరు పాముతో ఆడుకుంటున్నట్టుగా ఆ పిల్లాడు పాముతో ఆడుకుంటున్న తీరు చూసి నెటిజన్లు కంగుతిన్నారు. ఆ పిల్లాడి కుటుంబాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. అపాయం నుంచి ఆ పిల్లాడిని కాపాడాల్సింది పోయి సరదాగా చూస్తూ వీడియో తీస్తుండటంపై నెటిజన్లు మండిపడ్డారు.
ఫేమస్ అవ్వడం కోసం, వ్యూస్ కోసం అభంశుభం తెలియని పిల్లల జీవితాలను ఇలా రిస్క్ లో పడేయొద్దని నెటిజన్లు హితవు పలికారు. ఆ పిల్లాడితో దేనితో చెలగాటం ఆడుతున్నాడో కూడా తెలియదని, పిల్లాడికి ఏమైనా జరిగితే ఆ వ్యూస్, లైక్స్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ వీడియోకు కోటీ 20 లక్షలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. ఆ వీడియోలో చిన్న పిల్లాడి ధైర్యం కంటే కూడా విచక్షణ లేని పెద్దల బాధ్యతారాహిత్యమే కనిపించింది.