వ్యాపారం అంటే మంచి నడవడిక ఉండాలి. ఓర్పు సహనంతో పాటు వచ్చే కస్టమర్స్ తో చాలా హుందాగా.. ఎంతో మర్యాదగా ప్రవర్తించాలి. అలా ఉంటేనే వ్యాపారస్తులు వ్యాపారం చేయగలరు. ఇంకా కస్టమర్లతో కలివిడిగా మాట్లాడుతూ.. పదజాలంతో ఆకట్టుకోవాలి. గల్లీ కొట్టు నుంచి పెద్ద పెద్ద బంగారం షాపు కదా దుకాణ యజమానులు ఇలా ఉంటేనే వ్యాపారంలో రాణించగలరు. లేదంటే వారి గిరాకీ దుబ్బతింటుంది కదా.. వారి ప్రవర్తనతో ఏమాత్రం కస్టమర్లకు ఇబ్బంది కలిగినా ఇక వేరేషాపు ఎతుక్కుంటారు. అంతేకాదు వారితో సన్నిహితులుగా ఉండే వారందరికీ కూడా ఆ షాపునకు వెళ్లవద్దని చెబుతుంటారు. కాని ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో ఓ షాపు యజమాని కస్టమర్లను చితక్కొట్టాడు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వీడియో చూశాక మీరు బార్బర్ షాపునకు పోవడానికే భయపడతారు. కస్టమర్లపై బార్బర్ ప్రవర్తించే తీరు చేస్తే ఆశ్చర్యపోతారు. సెలూన్ షాపులోకి వచ్చిన ఒక కస్టమర్ ను బార్బర్ చెంపలపై కొట్టగా .. ఇంకో కస్టమర్ ను బూటుతో తన్నిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. అయితే ఈ వీడియో కావాలని తీశారా.. లేకుంటే వారి మధ్య ఏమైనా వాగ్వాదం జరిగిందా అనే విషయం తెలిదయదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అయింది.
సెలూన్‌కు హెయిర్ మసాజ్ చేయించుకోవడానికి ఇద్దరు కస్టమర్లు వచ్చారు. బార్బర్ మసాజ్ చేయడానికి బదులు వారిపై ఏదో కోపం ఉన్నట్లు ఎడాపెడా కొట్టాడు. . అది కూడా చెంపలు, తలమీద తనకు బలమున్నంత బాదేస్తున్నాడు. పక్కనే ఉన్న మరో కస్టమర్ పై కూడా ఏకంగా బూటుతో కొడుతూ ఉన్నాడు. అలా ప్రవర్తిస్తున్న బార్బర్ ను చూసిన అక్కడి వారందరూ తెగ నవ్వేస్తున్నారు. అయితే ఈ వీడియో కేవలం సరదా కోసమే చేసినట్లుగా అనిపిస్తుంది. లేదంటే నిజంగానే బార్బర్ అలా చేస్తే ఎవరైనా ఊరుకుంటారా.. పెద్ద రచ్చరచ్చ అవుతుంది. కానీ మొత్తానికి ఈ వీడియో చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేరు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒక వినియోగదారుడు.. ఇందులో తమాషా ఏమీ లేదు అని అన్నాడు. మరో వినియోగదారుడు ఈ బార్బర్ ఎందుకు ఇలా చేశాడో తెలుసుకోవాలనుకుంటున్నాను అని తెలిపాడు. మరో వినియోగదారుడు.. తల వెనుక భాగంలో ఇలా కొట్టకూడదు అని కామెంట్ చేశాడు.