
ఇద్దరు మగాళ్లు ఒకరినొకరు ఇష్టపడ్డారు. కలసి జీవించాలనుకున్నారు. తమ మధ్య ఏర్పడిన సంబంధాన్ని మూడు ముళ్ల బంధంతో శాశ్వతం చేసుకోవాలనుకున్నారు. ఈ గే జంట పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇద్దరు మగవాళ్లు అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు యువకులు ఒకరినొకరు ఇష్టపడ్డారు. జీవితాంతం కలసి ఉండాలనుకున్నారు. తమ మధ్య ఏర్పడిన సంబంధాన్ని మూడు ముళ్ల బంధంతో శాశ్వతం చేసుకోవాలనుకున్నారు. ఈ జంట డబుల్ బారాత్ వీడియో ఇంటర్నెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ వీడియోలు ఇద్దరు వరులు డ్యాన్స్చేశారు. ధోల్ ధరువులతో ఊరేగింపులో ప్రేమకు హద్దులు లేవని ఈ గే జంట నిరూపించింది. ఈ వేడుక చాలా అద్భుతంగా ఉందని సోషల్ మీడియా యూజర్లు అంటున్నారు. కొరియోగ్రాఫర్ ఆకాంక్ష తన 'aka_naach' లో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై ఆంటీలు.. అంకుల్స్ స్పందించారు. వీరి వివాహ వేడుకకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రేజీగా మారాయి.
ఈ వీడియో ఇప్పటికే ( వార్త రాసే రాసే సమయానికి)య 4.2 మిలియన్ల వీక్షణలు పొందింది. ఇది అత్యంత అందమైన వివాహం అంటూ.... రెండు కుటుంబాలు ప్రేమ కోసం ఎలా కలసి వచ్చాయో చూడండి అంటే ఒకరు స్పందించారు. మరొకరు ఇది చాలా అందమైనది.. చాలా శక్తివంతమైనదని కామెంట్ చేశారు. ఇక మూడో వ్యక్తి అన్ని రూపాల్లో ప్రేమను వ్యక్తీకరించడం.. స్వీకరించడం చాలా బాగుందని రాసుకొచ్చారు. మరొక సోషల్ మీడియా యూజర్ ఇది గే కాదు.. ఇద్దరు వివాహితులు అని రాస్తూ.. వివాహితులు + చాలా భాంగ్రా + షోర్ + కుటుంబం = ఆనందంతో నిండిన హృదయం అని వ్యాఖ్యానించారు.