![సర్‌ప్రైజ్ చేసే విధి](https://static.v6velugu.com/uploads/2023/10/Vidhi-director-Srikanth-Rang_vBwAFGfxKg.jpg)
రోహిత్ నందా, ఆనంది జంటగా శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ దర్శకద్వయం తెరకెక్కించిన చిత్రం ‘విధి’. రంజిత్ ఎస్ నిర్మించిన ఈ మూవీకి శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. నవంబర్ 3న సినిమా రిలీజ్ కానుంది. సోమవారం టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. గెస్ట్‌గా హాజరైన విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘టీజర్ చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంది. ఆనంది ఏ సినిమా పడితే ఆ సినిమాలో నటించదు.
ఎంతో ఇంపార్టెన్స్ ఉంటేనే ఓకే చేస్తుంది. ఇక నిర్మాత రంజిత్ నాకు స్నేహితుడు. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి.. తనకు మంచి లాభాలుA తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా’ అన్నాడు. ఈ చిత్రంలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయని చెప్పాడు రోహిత్ నందా. కొంత గ్యాప్ తర్వాత ఇందులో నటించానని, అందరికీ నచ్చేలా సినిమా ఉంటుందని చెప్పింది ఆనంది. ‘సినిమాలోని కథ, కథనాన్ని ఎవ్వరూ ఊహించలేరు. చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాం’ అని దర్శక నిర్మాతలు చెప్పారు.