ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీకి షాక్​.. ఆమె మరిది గోపి అరెస్ట్​

ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీకి షాక్​.. ఆమె మరిది గోపి అరెస్ట్​

మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీకి భారీ షాక్ త‌గిలింది. ఆమె మ‌రిది.. విడ‌ద‌ల గోపీని ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు.  ఏపీ పోలీసులు ఆయనను హైద‌రాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి లో అదుపులోకి తీసుకున్నారు.  గురువారం ( ఏప్రిల్​ 24) తెల్లవారుజామున 5.30 గంటలకు  అరెస్ట్​ చేసి గచ్చిబౌలి పోలీస్​స్టేషనుకు తరలించారు. తరువాత అక్కడి నుంచి విజయవాడకు తరలించే అవకాశం ఉంది. 

స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి  కోటిన్నర రూపాయిలు వసూలు చేశారనే ఆరోపణలపై  కేసు నమోదు చేసిన పోలీసులు .. తాజాగా అరెస్ట్ చేశారు.మాజీ మంత్రి విడదల రజిని 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ ఏడాది మార్చిలో ఏసీబీ కేసు నమోదు చేయగా.. మాజీ మంత్రి విడదల రజినిని పోలీసులు ఏ1గా చేర్చారు. ఆమెతో పాటు ఐపీఎస్ అధికారి జాషువాను ఏ2గా చేర్చారు. రజిని మరిది గోపిని ఏ3గా, రజని పీఏ దొడ్డ రామకృష్ణను ఏ4గా పేర్కొన్నారు

దీంతో త‌న‌ను అరెస్టు చేయ‌కుండా.. ర‌జ‌నీ.. హైకోర్టును ఆశ్రయించారు. ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని కోరారు. అయితే..దీనిపై విచార‌ణ వాయిదా ప‌డుతోంది. ఇంత‌లోనే ఆమె మ‌రిది గోపీ ఏ 3 ను   గురువారం ( ఏప్రిల్​ 24)నహైద‌రాబాద్‌లో అరెస్టు చేశారు.