ఖిలావరంగల్ కోటను సందర్శించిన వియత్నాం దేశస్తులు

కాశీబుగ్గ, వెలుగు:   ఖిలావరంగల్​ కోటను శనివారం హైదరాబాద్​లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి శిక్షణా కేంద్రంలో   శిక్షణ పొందుతున్న వివిధ ప్రభుత్వ సంస్థలతో పాటు మీడియాలో పని చేస్తున్న 26మంది వియత్నాం దేశస్తులు కోటాను సందర్శించారు.

ఈ సందర్భంగా పీఆర్​ఓ ఆయూబ్​, పర్యాటక గైడ్​ ఆధ్వర్యంలో కాకతీయుల రాజులు పరిపాలించిన కాలం నాటి ఖిలావరంగల్​లోని మధ్య కోటలోని శిల్పాలను  చూశారు.   కీర్తి తోరణాలు, శిల్పాల అవరణంతో పాగు గుండు చెరువు, ఖుష్మ హాల్​, సింగారపు బావి, రాతి, మట్టి కోట తదితర కట్టడాల చరిత్రను వివరించారు.  ఈ కార్యక్రమంలో డాక్టర్​ ఎంసీబీహెచ్​ ఆర్​డి పాకల్టీ డాక్టర్​ కె.సురేశ్​ కుమార్​, శ్రీనివాస్​, కుమార్​ స్వామి, సిఐ మల్లయ్య, ఎస్​ఐ గోవర్ధన్​ తదితరులు ఉన్నారు.