
హైదరాబాద్, వెలుగు: విజువల్ సొల్యూషన్స్ ప్రొవైడర్ వ్యూసోనిక్ కార్పొరేషన్.. ఏపీ, తెలంగాణలో బలోపేతమవడంపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా విశాల్ పెరిఫెరల్స్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. తమ డిస్‌ప్లే బిజినెస్ మరింత ఎదిగేందుకు ఇది ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.
విశాల్ పెరిఫెరల్స్ తెలుగు రాష్ట్రాల్లో వ్యూసోనిక్ కంప్యూటర్ మానిటర్ పోర్టుఫోలియోకు భాగస్వామిగా పనిచేస్తుంది. వ్యూసోనిక్ మానిటర్లను విశాల్ రిటైల్ స్టోర్లలో లైవ్ డెమోకు అందుబాటులో ఉంటాయి.
వ్యూసోనిక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ మాట్లాడుతూ ఈ ఒప్పందం వల్ల తమ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ను బలోపేతం చేయవచ్చని అన్నారు.